సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి-మంచేపల్లి రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు బోయ అంజి చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్‌పై పశుగ్రాసం తీసుకెళ్తుండగా, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల వల్ల దారి కనిపించక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాల నివారణకు చెట్లను తొలగించి, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.