శుక్రవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు మాలగుండ్ల శంకరనారాయణ కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారు మిధున్ రెడ్డితో చర్చించారు. ఏపీ మద్యం స్కాం కేసులో మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు.