శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్‌లో అల్పాహారం తిన్న 10 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్టల్ సిబ్బంది అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.