హిందూపురం మండలంలో సీఐటీయూ పదవ జిల్లా మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆదివారం నగరంలో సీఐటీయూ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు.