హిందూపురంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 'జోహార్ వైయస్ఆర్' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు రమేష్ రెడ్డి, హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ దీపికా రెడ్డి, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.