చిలమత్తూరు మండల కేంద్రంలో కనుమ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు స్వచ్ఛందంగా భోజనం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.