శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం మండలం కిరికెర బసవన్నపల్లిలో అదృశ్యమైన బాలిక శ్రీవల్లి మృతదేహం సమీపంలోని నీటి కుంటలో బయటపడింది. రెండు రోజులుగా కనిపించని శ్రీవల్లి కోసం పోలీసులు గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంటి సమీపంలోని చెరువు కుంటలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.