హిందూపురం గ్రామీణ మండలం ఎం. బీరేపల్లికి చెందిన మహాలక్ష్మి (33) పసుపు కుంకుమ విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. తన మానసిక రుగ్మతతో ఉన్న భర్త, చిన్న పిల్లలను పోషిస్తున్న ఆమె పెరుగుతున్న అప్పుల భారంతో తన 12 ఏళ్ల కుమారుడు రిషిత్, 14 ఏళ్ల కుమార్తెతో కలిసి విషపు గుళికలు జ్యూస్ లా చేసి తాగారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో, సాయంత్రం వాంతులు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహాలక్ష్మి మంగళవారం ఉదయం మరణించగా అనంత ఆసుపత్రికి కుమారుడిని తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. అక్కడికి వెళ్ళాక స్పృహలో వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని చెప్పడంతో మంగళవారం సాయంత్రం పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.