శనివారం హిందూపురం ప్రాంతంలో కల్తీ కల్లు అమ్ముతున్నట్లు రుజువైతే టీఎఫ్ఎ సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ లక్ష్మి దుర్గయ్య హెచ్చరించారు. హిందూపురం, పులమతి సమీపంలోని కల్లు డిపోల్లో శాంపుల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. కల్తీ కల్లు ఉన్నట్లు తేలితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పృథ్వీరాజ్, ఫరూక్, నారాయణస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.