కల్లి తండా గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్మూ కశ్మీర్ లో వీరమరణం పొందడంపై శుక్రవారం మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరవలేమన్నారు. ఈ క్రమంలోనే మురళీనాయక్ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.