సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గురువారం హిందూపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలు, ఎఫ్ఐఆర్లకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలని, పెట్రోలింగ్ ను ప్రతిరోజూ నిర్వహిస్తూ ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీతో పాటు డిఎస్పి మహేష్ కరీం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.