సత్యసాయి : వైసీపీ ఇన్చార్జి దీపికా రెడ్డి అరెస్టుతో ఉద్రిక్తత

8318చూసినవారు
చిలమత్తూరు మండల వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దీపికా రెడ్డి, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని సద్భావన సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.