హిందూపురం పట్టణంలో త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పట్టణంలో పలుచోట్ల పర్యటించి, ముఖ్యంగా గురునాథ్ సినిమా థియేటర్ సమీపంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.