తనకల్లు మండలానికి చెందిన వెంకటరమణప్ప మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు అతనికి 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీసులు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తనతో పాటు అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు శిక్ష విధించిందని తెలిపారు.