శనివారం ఉదయం కదిరి మున్సిపాలిటీలో జీరో వేస్ట్ పై చాయ్ పే చర్చ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర డైరెక్టర్ పర్వీన్ భాను ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తో కలిసి టీ తాగుతూ పట్టణ పరిశుభ్రతపై చర్చించారు. పర్యావరణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆమె తెలిపారు.