కదిరి: బైక్ రేసింగ్ చేస్తూ పట్టుబడ్డ నలుగురు యువకులు

73చూసినవారు
కదిరి: బైక్ రేసింగ్ చేస్తూ పట్టుబడ్డ నలుగురు యువకులు
కదిరి శివారులోని హిందూపురం రోడ్డు నుండి అనంతపురం రోడ్డు వరకు కొత్తగా నిర్మిస్తున్న కదిరి ఔటర్ రింగ్ రోడ్డులో సుమారు 10 మంది యువకులు బైక్ రేసింగ్ చేస్తుండగా పోలీసులకు నలుగురు యువకులు పట్టుబడ్డారు. గురువారం రాత్రి కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నలుగురు యువకులు, వారి తల్లిదండ్రులకు డిఎస్పీ శివనారాయణ స్వామి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తహసిల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేయడం జరిగిందని సీఐ నారాయణ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్