కదిరి నియోజకవర్గం ఎన్. పి. కుంట మండలం గోవిందరాజుల పల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.