కదిరి పట్టణంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న
క్రికెట్ టోర్నమెంట్లో శనివారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జట్టు, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జట్టు తలపడ్డాయి. 119 పరుగులు చేసిన కదిరి జట్టుపై, జిల్లా ఎస్పీ జట్టు రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే కందికుంట పేర్కొన్నారు.