శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం రాత్రి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి, మహిళలు మరియు ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవగాహన కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, మరియు పోలీస్ సిబ్బంది గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై, నేరాల నివారణపై అవగాహన కల్పించారు.