తనకల్లు మండలం నల్లగుట్టపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొందలపల్లికి చెందిన వెంకటరమణ గాయపడ్డారు. వందేమాతరం టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని, వెంకటరమణకు చేయి విరిగినట్లు గుర్తించి, వెంటనే అంబులెన్స్ ద్వారా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వెంకటరమణ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.