జనవరి 19న జరగబోయే వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కటారుపల్లిలోని వేమన సమాధి ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు, రెడ్డి కులస్థులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ కుటుంబ సమేతంగా, ముఖ్యంగా పిల్లలతో హాజరై వేమన అందించిన పద్యాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు.