ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
మంగళవారం కదిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హుస్సేన్, ఇతర సిబ్బంది, అధికారులతో సమావేశమై రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు.
