రౌడీ షీటర్ల ఇళ్లలో పోలీసుల తనిఖీలు

7చూసినవారు
రౌడీ షీటర్ల ఇళ్లలో పోలీసుల తనిఖీలు
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు కదిరిలో 'ఆపరేషన్ పీస్' పేరుతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి నేతృత్వంలో బుధవారం ఉదయం 81 మంది రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు జరిగాయి. పాత నేరస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో నిబంధనలను ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ లేదా పట్టణ బహిష్కరణ వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్