రాష్ట్రస్థాయి నీటి సంరక్షణ, భద్రత, భవిష్యత్తు సమావేశానికి కదిరి నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు బుధవారం అమరావతికి తరలివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో వీరు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశం నీటి వనరుల సంరక్షణ, భద్రత, భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారిస్తుంది.