ఎర్రదొడ్డి గంగమ్మకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించండి

8చూసినవారు
కదిరి మండలంలోని ప్రసిద్ధ ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కదిరికి చెందిన ఓంకార్ అనే భక్తుడు ఆలయ ఈవో నరసింహారాజును కలిసి, ఉగాది పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. వేసవి దృష్ట్యా ఈ సౌకర్యాలు అవసరమని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్