స్కూల్ బస్సులకు అన్ని అనుమతి పత్రాలు ఉండాలి

కదిరి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర అనుమతి పత్రాలను రెన్యువల్ చేసుకోవాలని కదిరి రవాణా శాఖ ఆర్టీవో శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు వరప్రసాద్, రాజేష్ తెలిపారు. బుధవారం ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీలు నిర్వహించిన అధికారులు, మే 15 తర్వాత అనుమతులు లేని బస్సులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సులకు అన్ని అనుమతులు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
