జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, ఆదివారం జిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, ఓపెన్ డ్రింకింగ్ పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఎస్ఐలు, సిబ్బందితో కలిసి డ్రోన్ నిఘా చేపట్టారు.