పోలీసులు వెళ్తున్న వాహనం బోల్తా

11చూసినవారు
పోలీసులు వెళ్తున్న వాహనం బోల్తా
కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో విద్యుత్ నియంత్రికల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా కదిరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న పోలీసుల ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రెడ్డప్ప గాయపడ్డారు. సీఐ నాగేంద్ర, ఎస్సై వలిబాషా, కానిస్టేబుల్ నారాయణస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతింది.

సంబంధిత పోస్ట్