తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీకి పాల్పడిన దోషులకు శిక్ష తప్పదని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ తెలిపారు. గురువారం కదిరి జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేని భోలే బాబా డెయిరీకి స్వార్థ ప్రయోజనాల కోసం 2019 నుండి 2024 వరకు 20 లక్షలకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేయించారని ఆరోపించారు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను అవహేళన చేయడమేనని ఆయన పేర్కొన్నారు.