కళ్యాణదుర్గం - Kalyandurg

కామారెడ్డి జిల్లా
Apr 11, 2026, 13:04 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులదే కీలక పాత్ర

Apr 11, 2026, 13:04 IST
ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులదే కీలక పాత్ర అని ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ప్రవీణ్ బొమ్మెర అన్నారు. శనివారం కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, డిసిఏ, ఈగల్ ఫోర్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 90% హాస్పిటల్స్, రిటైల్ మెడికల్ షాపులు అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా నడుస్తున్నాయని, ఫార్మసిస్టులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.