అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన మూతపడిన 4 హాస్టళ్లు

2589చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన మూతపడిన 4 హాస్టళ్లు
కంబదూరు మండలం తిమ్మాపురంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన సేవా మందిరం, 4 హాస్టళ్లు ప్రస్తుతం మూతపడ్డాయి. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని గ్రామస్థులు ఆదివారం తెలిపారు. పూర్వ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవమ్మ, టీసీ మారెప్ప విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నందున ఈ నాలుగు హాస్టళ్లను ఏర్పాటు చేయించారు. మూతపడిన హాస్టళ్లను తిరిగి తెరిపించాలని పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.