కంబదూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లిన అజయ్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. ఈత రాకపోవడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. తనయుడి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.