చెన్నేకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి దుర్మరణం

13చూసినవారు
చెన్నేకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి దుర్మరణం
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో కుమార్తెను తీసుకురావడానికి తిరుపతి వెళ్లిన వెంకటేశ్వర్ రెడ్డి(44) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చెన్నేకొత్తపల్లి మండలం నామాల గ్రామానికి చెందిన ఆయన, ధర్మవరం నుంచి రైలులో తిరుపతికి చేరుకున్నారు. శనివారం ఉదయం రైలు దిగి రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్