కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లిలో శనివారం శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి జాతర వైభవంగా జరిగింది. ఉదయం నుంచే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు నైవేద్యం సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. జాతరలో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.