దుర్గం: నీటిలో కొట్టుకుపోకుండా ఇద్దరిని రక్షించిన గ్రామప్రజలు

3664చూసినవారు
బ్రహ్మసముద్రం మండలంలోని బీటీపీ ప్రాజెక్ట్ నుంచి సోమవారం 2 గేట్లు ఎత్తడంతో భారీగా నీరు ప్రవహించింది. ఈ క్రమంలో వేపులపర్తి అగిరి వద్ద ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తు, గ్రామస్థులు, ఈతగాళ్లు వెంటనే స్పందించి తాడు సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్