కళ్యాణదుర్గం నార్త్ ప్రాథమిక పాఠశాలలో మే 1 నుంచి 15 వరకు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేవీవీ జిల్లా ఉపాధ్యక్షులు చిత్తప్ప తెలిపారు. బుధవారం పెన్షన్ భవన్లో గౌరవాధ్యక్షులు మల్లికార్జునతో కలిసి పోస్టర్లు విడుదల చేశారు. ఈ శిక్షణ 3 నుంచి 10వ తరగతి పిల్లలకు చిత్రలేఖనం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లీష్, పేపర్ కటింగ్ వంటి అంశాలలో అందించబడుతుంది. ఆసక్తిగల
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.