కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో పెన్నానదిలో వరద నీటి ప్రవాహం పెరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలో నీరు చేరి ప్రవాహం పెరగడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ నదిలో నీరు లేక వెలవెలబోయింది. ప్రస్తుతం నీటి ప్రవాహం కారణంగా చుట్టుపక్కల పొలాల్లోని బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగుతుందని తెలిపారు.