కళ్యాణదుర్గం: కూలడానికి సిద్ధంగా ఉన్న కటౌట్

4326చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం ప్రధాన రహదారిపై అక్కమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పెద్ద కటౌట్ కూలిపోయే స్థితిలో ఉంది. రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుండటంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మండల ప్రజలు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి కటౌటు తొలగించి, రహదారిపై ప్రయాణించే వారికి భద్రత కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్