కళ్యాణదుర్గం: గర్భం దాల్చిన బాలిక!

11చూసినవారు
కళ్యాణదుర్గం: గర్భం దాల్చిన బాలిక!
కళ్యాణదుర్గం మండలం లోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక గర్భవతి అని మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె అనారోగ్యంతో ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు గర్భవతి అని నిర్ధారించారు. ఇంటికి తరచుగా వచ్చి వెళ్లే బంధువుపై అనుమానం ఉందని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్