కళ్యాణదుర్గం: పూర్వ విద్యార్థుల సమావేశం

11చూసినవారు
కళ్యాణదుర్గం: పూర్వ విద్యార్థుల సమావేశం
కుందుర్పి మండలంలోని అపిలేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014-15లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు బుధవారం అదే పాఠశాలలో సమావేశమయ్యారు. తమ చదువుకున్న పాఠశాలలో తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు బీసీ తిమ్మప్ప, ఉపాధ్యాయులు లక్ష్మన్న, జయశ్రీ, పరమేశ్వర పాల్గొన్నారు. విద్యార్థులు తమ పాఠశాల అనుభవాలను పంచుకున్నారు.

ట్యాగ్స్ :