కళ్యాణదుర్గం: 'ఆత్మగౌరవం కోసమే ఆందోళన'

2222చూసినవారు
కళ్యాణదుర్గంలో మంత్రి లోకేశ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాల వేయకపోవడంపై వీసీకే రాష్ట్ర కార్యదర్శి మందల రమేశ్ స్పందించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, దళిత సంఘాల నేతలు ఆత్మగౌరవం కోసమే ఆందోళన వ్యక్తం చేశారని, దీనిని బురదజల్లే ప్రయత్నంగా చూపించడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం తగదని తెలిపారు. MLA అమిలినేని సురేంద్ర బాబు చేసిన అభివృద్ధిని ఆయన ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్