కళ్యాణదుర్గం: కన్నుల పండుగగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

కుందుర్పి మండలం అపిలేపల్లి ప్రాధమికొన్నత పాఠశాలలో విద్యార్థులకు భోగిపళ్లు వేసి ప్రధానోపాధ్యాయుడు హనుమంతరాయుడు, ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి, ఇందులో బీజేపీ మహిళ మోర్చా ఆధ్యక్షురాలు దగ్గు బాటి సౌభాగ్య పాల్గొన్నారు. విద్యార్థులు భోగి మంటలు వేశారు, ముగ్గులు వేశారు. బెళుగుప్ప స్థానిక సన్రైజర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కూడా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు, ముగ్గుల పోటీలు జరిగాయి. విజేతలకు ఎస్ఐ శివ బహుమతులు అందజేశారు.
