కళ్యాణదుర్గం: మామిడి చెట్టు నిండా పూతే - ఆనందంలో రైతు

26చూసినవారు
కళ్యాణదుర్గం: మామిడి చెట్టు నిండా పూతే - ఆనందంలో రైతు
శెట్టూరు మండలంలోని బసంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన మామిడి తోటలో విరబూసిన చెట్టును చూసి ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం, చెట్టు కనిపించకుండా మొత్తం పూతతో నిండి ఉంది. తెగుళ్లు సోకకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు, సేంద్రియ ఎరువు వాడకం వల్ల పూత అధికంగా వచ్చిందని రైతు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి గ్రామ రైతులు సంతోషిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్