కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేశారని, దీనివల్లే ఆయన పదవి కోల్పోయారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్ వలీ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాజ్ కుమార్ 14 నెలలుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, మున్సిపల్ కార్యాలయానికి కూడా రాలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు పంపిన రిజిస్టర్ పోస్టులకు కూడా ఆయన స్పందించలేదని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని వలీ పేర్కొన్నారు.