కళ్యాణదుర్గం పట్టణంలోని పట్టాభిరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం అశేష జనవాహిని మధ్య కన్నుల పండువగా సాగింది. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వేడుకలు మిన్నంటాయి. పోలీసులు, ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.