కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్డులో నూతనంగా నిర్మించిన రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం రాత్రి మూల వృత్తిక, బృందావన ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మఠానికి విచ్చేసిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల సమాచారం ప్రకారం, పీఠాధిపతి బుధవారం పెద్దఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.