కళ్యాణదుర్గం: ఆనంద్ పరువు హత్య కాదు - ఆత్మహత్యే: డిఎస్పి

11చూసినవారు
కళ్యాణదుర్గం: ఆనంద్ పరువు హత్య కాదు - ఆత్మహత్యే: డిఎస్పి
బ్రహ్మసముద్రం మండలం యనకల్లుకు చెందిన ఆనంద్ ఆత్మహత్య చేసుకున్నారని, అది పరువు హత్య కాదని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆదివారం తెలిపారు. వ్యవసాయంపై ఆసక్తి లేక ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లిన ఆనంద్, ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్థాపానికి గురై రాయదుర్గం పెట్రోల్ బంక్ వెనుక ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నారని డీఎస్పీ వెల్లడించారు. రాజకీయ నాయకులు దీనిని పరువు హత్యగా ఆరోపించడం సరికాదని, పంచనామాలో ఆత్మహత్యగా నిర్ధారణ అయిందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్