తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఒక బాలుడు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి మాటలు సరిగా రాకపోవడంతో వివరాలపై స్పష్టత లేదు. తనది కుందుర్పి అని, తల్లిదండ్రుల పేర్లు మారుతి, లక్ష్మి అని చెబుతున్నాడు. బాలుడి ఆనవాళ్లను గుర్తించిన వారు ఆసుపత్రికి వచ్చి తీసుకెళ్లాలని వైద్యులు కోరుతున్నారు.