కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైన్ షాపులకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు. శెట్టూరు మండలం చిన్నంపల్లిలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు కంకర అవసరమైనప్పుడు గనుల శాఖ అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే మంచిది కాదని ఆయన అన్నారు.