కళ్యాణదుర్గం: వైసీపీవి పచ్చి అబద్ధాలు: ఎమ్మెల్యే

6చూసినవారు
కళ్యాణదుర్గం: వైసీపీవి పచ్చి అబద్ధాలు: ఎమ్మెల్యే
శెట్టూరు మండలంలోని మాకొడికి గ్రామంలోని పాఠశాలలో తరగతి గదిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, డీఈవో ప్రసాద్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా 125 గ్రామీణ రహదారులకు ప్రతిపాదనలు పంపగా, ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గోపాలప్ప పాఠశాల భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వడాన్ని అభినందించిన ఆయన, పాఠశాల అభివృద్ధికి తన సొంత నిధులు కూడా కేటాయించామని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల పచ్చి అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :